వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రిమాండ్

YSRCP MLA Kotamreddy Sridhar Reddy Arrest
YSRCP MLA Kotamreddy Sridhar Reddy Arrest

వైసిపికు చెందిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు . పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కారణంతో ఆయనపై వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌లో నాన్ బెయిలబుల్‌ కేసు నమోదైంది. ఇవాళ్టి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన శ్రీధర్‌రెడ్డి నెల్లూరులోని వైసిపి ఆఫీసు వద్ద దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించ‌గా వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. అరెస్ట్‌కు నిరసనగా కార్యాలయం ముందు శ్రీధర్‌రెడ్డి భైఠాయించ‌డంతో వైసిపి ఆఫీసు ముందు ఉద్రిక్తత ఏర్ప‌డింది. ఇటు అరెస్టయిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఆయనను సెట్రల్‌ జైలుకు తరలించారు.