ఓట‌మిని హుందాగా ఒప్పుకోవాలి – అంబ‌టి

Ambati Rambabu
Ambati Rambabu

ఐదేళ్ల పాలనలో వ్యవస్థల్నీ చంద్రబాబు భ్రష్టు పట్టించారని ఆరోపించారువైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. గత కొంతకాలంగా ఆయన ప్రవర్తన విచిత్రంగా ఉందని, అధికారులు, ఈవీఎం, వీవీప్యాట్ల అంశాలపై తగాదా పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని, ఎగ్జిట్‌ పోల్స్‌ను చూసే చంద్రబాబుకు వణుకుపుట్టిందని అంబటి అభిప్రాయపడ్డారు. మే 23న ఫలితాలు చూస్తే తట్టుకోలేరన్నారు. కేంద్రంలో తమ పాత్ర ఏంటో మే 23 తరువాత వెల్లడిస్తామని స్పష్టంచేశారు. ఎన్నికల్లో ఓటమి సహజమేనని, ఓడినప్పుడు కూడా హుందాగా ఉండాలని హితవు పలికారు. చంద్రబాబు గెలిచినప్పుడు ఇవే ఈవీఎంలుతో కాదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఓటమి అంగీకరించలేక ఈవీఎంలపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నార‌న్నారు అంబ‌టి .