పులివెందుల నుంచి జ‌గ‌న్ నామినేష‌న్

Jagan Nomination done from Pulivendula
Jagan Nomination done from Pulivendula

క‌డ‌ప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ నామినేషన్‌ దాఖలు చేశారు. పులివెందుల తహసీల్దార్‌ కార్యాలయంలో మధ్యాహ్నాం 1.49 గంటలకు రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌ పత్రాలు సమర్పించే ముందుఆయ‌న సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. జగన్‌ వెంట కుటుంబసభ్యులు, సీనియర్‌ నేతలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వ‌చ్చారు. దీనికి ముందు సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు జగన్‌.