వైసిపి మేనిఫెస్టో పై జగన్ దృష్టి

YS Jagan
YS Jagan

వైసిపి మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సూచించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసిపి మేనిఫెస్టో కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మేనిఫెస్టోలో ఆచరణకు సాధ్యమయ్యే హామీలను మాత్రమే పొందుపరచాలని కోరారు.

వాగ్దానాలు చేయడంలో ఏ పార్టీతోనూ తమకు పోటీ లేదన్న ఆయన , ఇచ్చే వాగ్దానాలన్నీ నిజాయితీగా ఇద్దామన్నారు. కౌలు రైతులకు మేలు కలిగేలా మేనిఫెస్టోలో అంశాలను చేర్చాలని కమిటీ సభ్యులకు సూచించారు. మేనిఫెస్టో రెండు పేజీలు మాత్రమే ఉండాలని ఆయన అన్నారు.