మొక్కులు చెల్లింపుల్లో ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్

YS Jagan
YS Jagan

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగించుకొని వరుసగా మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పాద‌యాత్ర ముగించుకుని తిరుమ‌ల‌లో శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఇక క‌డ‌ప గ‌డ‌ప‌లో ప్రసిద్ధిగాంచిన అమీన్ పీర్ దర్గాను కూడా సందర్శించారు. ఇవాళ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలను చేయ‌నున్నారు. అనంతరం గండి ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు.

అక్కడ నుండి ఇడుపులపాయ చేరుకొని వైఎస్ఆర్ ఘాట్ నందు నివాళి అర్పించనున్నారు. ఇలా స‌ర్వ‌మ‌త ప్రార్ధ‌న‌ల‌తో పాటు జగన్. దైవ దర్శనాలతో బిజీగా గడపనున్నారు. ఇక ఫ్యామిలీ టూర్ కోసం విదేశాలు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని కేంద్రంగా మ‌కాం వేసే ప్ర‌తిప‌క్ష నేత అసెంబ్లీ స‌మావేశాల అనంత‌రం బ‌స్సు యాత్ర‌కు ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం .