ఇటు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వైఎస్ షర్మిల..!

YS Sharmila
YS Sharmila

వైఎస్ వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకున్న ఆయ‌న కుమార్తె వైఎస్ షర్మిల కూడా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రానున్నారు. ఈ దిశ‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌క్కా వ్యూహాన్ని సిద్దం చేసిన‌ట్లు స‌మాచారం. ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికలలో వైఎస్ షర్మిలను ఒంగోలు లోక్ సభ స్థానం నుండి పోటీకి దించనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికలలో ఒంగోలు లోక్ సభ స్థానం నుండి జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఎంపీగా గెలిచి ప్రాతినిధ్యం వ‌హించారు.

అయితే సుబ్బారెడ్డి వలన జిల్లాలో గ్రూపు రాజకీయాలు ఏర్పడ్డాయని పార్టీ సర్వేతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలో కూడా అభిప్రాయాలు వచ్చాయంటున్నారు. ఈ నేప‌ధ్యంలోనే ఈసారి ఒంగోలు నుండి షర్మిలనుఎన్నిక‌ల‌ రంగంలోకి దించాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. షర్మిల ప్రభావంతో జిల్లాలో బలం చేకూరుతుందని అధిష్టానం స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు తెలిసింది. అయితే సుబ్బారెడ్డిని రాజ్యసభకు లేదా ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లుగా పార్టీ అధినేత జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.