పింఛను అర్హత వయసు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌ వైఎస్‌ఆర్‌ పింఛను పథకాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్‌ భరోసా పేరును మార్చి వైఎస్‌ఆర్‌ పింఛను కానుక అని పెట్టారు . పింఛనును రూ. 2250 లకు పెంచుతున్నట్లు సియం జగన్‌ ఇచ్చిన తొలి హామీకి శుక్రవారం జీవో విడుదల చేసింది. జూన్‌ 1 నుంచి కొత్త పింఛను పథకం అమలులోకి రానుంది. వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ వ్యాధితో దయాలసిస్‌ చేయించుకుంటున్న బాధితులకు రూ.10 వేలు పింఛనుగా ఇవ్వనున్నారు. వృద్ధాప్య పింఛనుకు అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు కుదిస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఈ పింఛను మొత్తాన్ని జులై 1 నుంచి ఆందించనున్నారు.