గ‌వ‌ర్న‌ర్ ని జ‌గ‌న్ ఎందుకు క‌లిసారో తెలుసా..!

YS Jagan to meet Governor Narasimhan on 16 April
YS Jagan to meet Governor Narasimhan on 16 April

పోలింగ్‌ రోజున, పోలింగ్‌ తర్వాత ఆంద్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం పార్టీ అరాచకాలకు పాల్పడిందని గవర్నర్‌కు జగన్‌ ఫిర్యాదు చేశారు. పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి వైసిపి అధ్యక్షుడు జగన్‌.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. ఏపీలో పరిపాలన, శాంతిభద్రతల వైఫల్యంపై జగన్‌ గవర్నర్‌కు వివరించారు ఆయ‌న‌. చంద్రబాబు వైఖరి, ఆయన ఆదేశాల మేరకే ఈ దాడులు జరుగుతున్నాయని జ‌గ‌న్ ఆరోపించారు. గురజాల, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో ఎన్నికల రోజున జరిగిన ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లిన జగన్… పోలీసులు కూడా అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతూ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నరసింహన్ కు వినతిపత్రాన్ని సమర్పించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు.