ఐదేళ్ల బాబు పాలనలో అంతా మోసం – జగన్‌

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాక పక్కా ఇళ్లను కూడా కట్టిస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన రోడ్‌ షోలో మాట్లాడారు. కరెంటుపై యూనిట్‌కు రూ.9 వసూలు చేస్తున్నారని, తాము యూనిట్‌ కరెంటు రూ.3.75 పైసలకే అందజేస్తామన్నారు.

పేదలకు ఇచ్చే ఫ్లాట్లపై రూ.3వేల రుణాన్ని పూర్తి మాఫీ చేస్తామన్నారు. ఐదేళ్ల బాబు పాలనలో అంతా మోసం జరిగిందన్నారు. పసుపు కుంకుమ పేరుతో మహిళలను చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు . 2016 మే నుంచి సున్నా వడ్డీ పథకాన్ని బాబు రద్దు చేశారని విమర్శించారు. డ్వాక్రా మహిళలపై వడ్డీ రూపంలో బాబు భారం మోపారన్నారు.