వ‌చ్చే ఎన్నిక‌ల‌పై జోస్యం చెప్పిన జ‌గ‌న్

YS Jagan
YS Jagan

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని జోస్యం చెప్పారు వైసీపీ అధినేత జగన్. మేధావులు, తటస్తులతో ఆయ‌న హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స‌మావేశం అయ్యారు. అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా ఈ భేటీ జ‌రిగింది. వారి నుంచి సూచనలు, సలహాలను జగన్‌ తీసుకున్నారు. రానున్న రోజుల్లో 13 జిల్లాలో ఇటువంటి సమావేశాలు నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో ప్రభావం చూపగల 60 వేల మంది జగన్‌ నుంచి వ్యక్తిగతంగా ఈ లేఖ‌లు అందుకున్నారు. వారిలో కొందరు తొలి విడతగా జ‌రిగిన ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు జ‌గ‌న్ స‌మాధాన‌మిచ్చారు. కేంద్రంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయ‌న్నారు. ఎన్నికలకు ముందు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోమని, వాళ్ల మాటలు నమ్మి ముందే పొత్తులు పెట్టుకుంటే మోసపోతామని వ్యాఖ్యానించారు వైసిపి అధినేత జ‌గ‌న్‌. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎవరైతే సంతకం పెడతారో వారికే తమ మద్దతిస్తామని మరోసారి స్పష్టం చేశారు.