బాబు అడ్డా కుప్పంలో జ‌గ‌న్ ఏమ‌న్నారో తెలుసా

ys-jagan-mohan-reedy
ys-jagan-mohan-reedy

అధికార పార్టీ అధినేత ఇలాకాలో ప్ర‌త‌ప‌క్ష నేత ఇవాళ ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. రానున్న ఎన్నికల్లో కుప్పం ప్రజలు సిఎం చంద్రబాబు ని ఓడించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయ‌న పాల్గొన్నారు. చంద్రబాబును చంద్రగిరి ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక‌సారి చంద్రగిరి నుంచి గెలిచిన ఆయన, రెండోసారి భారీ తేడాతో ఓడిపోయారన్నారు. ఇదే స్ఫూర్తిని కుప్పం ప్రజలు ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందన్నారు జ‌గ‌న్ .

కుప్పంలో వైసీపీని గెలిపిస్తే, ఇక్కడి ప్రజలకు అభివృద్ధి ఎలా ఉంటుందో తాను చూపిస్తానని జగన్ హామీ ఇచ్చారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కుప్పంలో కేవలం 18వేల ఇళ్లే కట్టించారన్నారు. కుప్పంలో ప్రజలు పడుతున్న బాధలను చూశానన్నారు జ‌గ‌న్‌. చాలా గ్రామాల్లో ఇప్పటికీ ప్రాథమిక విద్య లేదన్నారు.కుప్పం నియోజకవర్గానికి కనీసం ఒక డిగ్రీ కాలేజీ కూడా తీసుకు రాలేక పోయారని విమ‌ర్శించారు జ‌గ‌న్