బాబు అవినీతిపై పెద‌వి విప్ప‌ని ప‌వ‌న్ – జ‌గ‌న్

YS Jagan
YS Jagan

అధికారంలో ఉన్న చంద్రబాబు అవినీతిపై పవన్ పెద‌వి విప్ప‌ర‌న్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జ‌గ‌న్‌. కేవలం తనను మాత్రమే తిడతాడన్నారు ఆయ‌న‌. ఇలాంటి కుట్రలు ఇంకా చాలా జరుగుతాయన్నారు. చంద్రబాబు ఏం చెబితే అది పవన్‌ చేస్తున్నారన్నారు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్ర‌సంగించారు. డైరెక్టర్‌ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ యాక్టర్‌ పవన్‌ చదువుతున్నారన్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. మా బాబాయి హత్య జరిగితే చంద్రబాబు పండగ చేసుకున్నారన్నారు. వైఎస్‌ వివేకా హత్యపై పవన్‌ కూడా అసత్యాలు మాట్లాడుతున్నారన్నార‌ని ఫైర‌య్యారు జ‌గ‌న్. త‌మ కుటుంబ సభ్యులపై మాట్లాడుతున్న మాటలు చూస్తే బాధగా ఉందన్నారు.

డ్వాక్రా సంఘాల్లోని రుణాలను మాఫీ చేయకుండా మోసం చేశారన్నారు . వైఎస్‌ హయాంలోనే సున్నా వడ్డీ రుణాలు వచ్చేవన్నారు. ఎన్నికల తేదీ వరకు ఉన్న పొదుపు సంఘాల్లోని రుణాలు మాఫీ చేస్తానన్నారు. సున్నా వడ్డీ రుణాలు మళ్లి వైఎస్‌ తర్వాత తానే ఇస్తానన్నారు ఆయ‌న‌. 45 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసున్న మహిళలకు వైఎస్‌ఆర్‌ చేయూత కింద రూ.75వేలు ఇస్తానని ప్ర‌క‌టించారు. మే మాసంలో పెట్టుబడి కింద రూ.12,500 ఇస్తానన్నారు. గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఉంటానని అభ‌యం ఇచ్చారు జ‌గ‌న్‌. ఓటు కోసం ఒక్కొక్కరికి రూ.3వేలు పంచుతున్నారని, చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు మోసపోవద్దని జ‌గ‌న్ సూచించారు.