చంద్ర‌బాబు చేత‌కానివాడు అవ్వ‌డం వ‌ల్లే…

YS Jagan
YS Jagan

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి రావాల్సిన వాటిపై ఎలాంటి ప్రకటనా లేదని విమర్శించారు ఆంద్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌. కేంద్ర బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. సీఎం చేతకానివాడైతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో చెప్పడానికి చంద్రబాబే పెద్ద ఉదాహరణ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పీహెచ్ డీలు తీసుకున్నాయ‌న్నారు. ఈ ప్రలోభాలు చూస్తుంటే రాజకీయాలు ఎంతగా దిగజారాయో అర్థమవుతోందని విమర్శించారు.

ఓటుకు నోటు కేసులో కేంద్రానికి చంద్రబాబు లొంగిపోవడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న సిఎం చంద్రబాబు,ఏపీకి ప్రత్యేక హోదాను వదిలి ప్యాకేజ్ కు ఒప్పుకున్నారని ఆరోపించారు.అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై మాట్లాడడానికి తమకు 30 సెకన్ల సమయం కూడా ఇవ్వలేదని విమర్శించారు. అసెంబ్లీలో ఎవరూ లేని సమయం చూసి చంద్రబాబు భారీ డైలాగులు చెబుతున్నారని, అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం కూడా లేద‌న్నారు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌.