బాబుపై జ‌గ‌న్ సెటైర్లు

Jagan Chandrababu
Jagan Chandrababu

చంద్రబాబు అక్రమంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సంఖ్య 23 అని, ఈ ఎన్నికల్లో చంద్రబాబు సహా ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23 అని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ 23 అని వైసీపీ అధినేత జగన్ లాజికల్ గా మాట్లాడుతూ టీడీపీపై సెటైర్ వేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఎల్పీ నేతగా జగన్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, అక్రమాలు చేస్తే దేవుడు ఏ రకంగా మొట్టికాయలు వేస్తాడో చెప్పడానికి నిదర్శనం చంద్రబాబేనని, దేవుడు అంత గొప్పగా స్క్రిప్ట్ రాశాడని అన్నారు. ప్రజలు మనకు గొప్ప బాధ్యత అప్పగించారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు.