కోడికత్తి కేసులో నిందితుడు ఏం చెబుతున్నాడంటే..!

YS Jagan Attacker Janepalli Srinivasa Rao
YS Jagan Attacker Janepalli Srinivasa Rao

 వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావును ఐదో రోజు ఎన్ఐఏ అధికారులు విచారణ జరుపుతున్నారు.  శ్రీనివాస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అధికారులు విచారణ చేపట్టారు.   అలాగే విశాఖ ఫ్యూజెన్‌ హోటల్‌ యజమాని హర్షకుమార్‌ని కూడా ఎన్‌ఐఏ అధికారులు విచారించనున్నారు.  శ్రీనివాసరావు వ్యక్తిగత వివరాలతో పాటు చదువు, ఉద్యోగాలు, స్నేహితులకు సంబంధించిన వివరాలపై అధికారులు ప్రశ్నిస్తున్నారు.   విచారణ ప్రక్రియను వీడియో, ఆడియో రికార్డింగ్‌ చేస్తున్నారు.  అయితే విచారణ ప్రక్రియ అంతా శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీమ్‌,  మట్టా జయకర్‌ సమక్షంలోనే జరుగుతుంది.    నాలుగు రోజులుగా అధికారుల విచారణలో  జగన్‌పై దాడి విషయంలో తన వెనుక ఎవరూ లేరని, సంచలనం కోసమే జగన్‌పై దాడి చేసినట్లు శ్రీనివాస్ చెబుతున్న‌ట్లు స‌మాచారం.