సూపర్ హిట్ సినిమా సీక్వెల్…ఆల్ సెట్ !

Karthikeya 2
Karthikeya 2

చందూ మొండేటి కి డైరెక్టర్ గా లైఫ్ ఇచ్చిన సినిమా,నిఖిల్ కి హీరోగా పెద్ద రేంజ్ సక్సెస్ ని ఇచ్చిన సినిమా…రెండూ ఒకటే.అదే కార్తికేయ.ఆ సినిమా తరువాత చందు ప్రేమమ్ అనే రీమేక్ సినిమా చేసి హిట్ కొట్టాడు.అయితే తన రేంజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళుతుంది అని నమ్మి సవ్యసాచి అనే సినిమా చేసాడు.కానీ అది డిజాస్టర్ అయ్యింది.దాని తరువాత శర్వానంద్ తో సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు.కానీ శర్వా నో చెప్పడంతో ఆ సినిమా మొదలవకుండానే ఆగిపోయింది.

కార్తికేయ తరువాత నిఖిల్ తన రేంజ్ ని పెంచుకునే ప్రయత్నం చేసేది.ఎక్కడికి పోతావు చిన్నవాడా తప్ప ఏదీ కూడా నిఖిల్ అనుకున్నరేంజ్ హిట్ గా నిలవలేదు.కన్నడ బ్లాక్ బస్టర్ సినిమా కిరిక్ పార్టీ ని కిరాక్ పార్టీ గా రీమేక్ చేస్తే అది కాస్త దారుణంగా మిస్ ఫైర్ అయ్యింది.తమిళ్ సినిమా కనితన్ ని అర్జున్ సురవరం గా రీమేక్ చేసాడు.సుదీర్ఘంగా సాగుతూ షూటింగ్ పూర్తిచేసుకున్న ఆ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుంది అనేది ఇప్పుడే చెప్పలేం.అయితే ఈ లోగా మరొక మంచి కాన్సెప్ట్ అంటూ నితిన్ షూటింగ్ మొదలుపెట్టిన ‘శ్వాస’ షూటింగ్ సగంలో ఆగిపోయింది.హీరోగా నిఖిల్,డైరెక్టర్ గా చందూ మొండేటి ఇద్దరూ కూడా ఇప్పడు ఖాళీగా ఉన్నారు.

అందుకే ఎప్పటినుండో అనుకుంటున్నకార్తికేయ-2 కి ఇప్పుడు సరయిన టైం వచ్చింది.ఆ సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లేందుకు చందూ ఆల్రెడీ ఓకే చెప్పేసి వర్క్ స్టార్ట్ చేసాడు.నిఖిల్ కి కూడా ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు.దాంతో తమ రాత మార్చిన సినిమాకి సీక్వెల్ చెయ్యడానికి ఇద్దరూ రెడీ అయ్యారు.మరి వీళ్ళ కెరీర్స్ కి  కార్తికేయ-2 ఎలాంటి టర్నింగ్ పాయింట్ అవుతుందో చూడాలి.