డైరెక్టర్ తేజ కొత్త సినిమా టైటిల్ ఖరారు…!

Director Teja
Director Teja

విభిన్న చిత్రాల దర్శకుడు తేజ దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.శ్రీనివాస్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా టైటిలే ఇటివలే ఖరారు చేసారు. ఈ సినిమాకు సీత అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దర్శకుడు తేజ, ఈ సినిమా టైటిల్ లోగోను తన ఫేస్ బుక్ ఖాతాలో విడుదల చేశారు.

అంతేకాదు, రేపు సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది.ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా మార్చి నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.