ఏపిలో పసుపు కుంకుమ హడావిడి మొదలు

#Andhara Pradesh #Apcm #Chandarababu #Penshion

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రవేశ పెట్టిన కొత్త పథకాల అమలులో కి వచ్చాయి . నేటి నుంచి పసుపు కుంకుమ, పెన్షన్ లు అందజేయనున్నారు. గుంటూరులో ఈ నెల 2,3,4, తేదీలలో మూడు రోజుల పాటు పెన్షన్లు, డ్వాక్రా, మెప్మా మహిళలకు పసుపు కుంకుమ నగదు పంపిణీ చేయాలనీ AP ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పెన్షన్‌ లబ్ధిదారులకు రూ.150 కోట్లు నగదు అందజేయనున్నారు. ఇందుకోసం బ్యాంకర్లతో చర్చించి ముందుగానే నగదు సిద్ధం కూడా చేయించారు.

మూడు బృందాలు గ్రామ, మండల, మున్సిపల్‌, నగరపాలక సంస్థ పరిధిలో మూడు రోజుల పాటు పసుపు కుంకుమ, పెన్షన్ లను లబ్దిదారులకు అందజేస్తారు అని తెలిపారు.