తెలంగాణలో కూడా బిజెపి సత్తా చాటుతుంది

B. S. Yeddyurappa
B. S. Yeddyurappa

తెలంగాణలో కూడా బీజేపీ సత్తా చాటుతుందన్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప. సికింద్రాబాద్, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని భావిగి భద్రేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ … దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ గాలి వీస్తోందన్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందనే ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. 280 సీట్లు సాధించి మోదీ మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించబోతున్నారని జోస్యం చెప్పారు. కర్ణాటకలో 20 నుంచి 22 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోబోతోందని వివ‌రించారు ఆయ‌న‌.