‘నిన్ను నమ్మం బాబు’ అంటున్న వైసిపి నాయకులు…!

ysr congress party

ప్రజల్లో చంద్రబాబు నాయుడును డీగ్రేడ్ చేసేందుకు వైఎస్ జగన్ కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ఇప్పటికే జాబు రావాలంటే బాబు పోవాలి అనే నినాదాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వైకాపా ఇప్పుడు ‘నిన్ను నమ్మం బాబు’ అనే కొత్త స్లోగన్ తయారుచేసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఈ స్లోగన్ బాగా ప్రాచుర్యం పొందేలా చేయాలని పార్టీ శ్రేణులన్నింటికీ ఆదేశాలు వెళ్లిపోయాయట.ఈమేరకు కొందరు పార్టీ నేతలు తమ వాహనాలపై ‘నిన్ను నమ్మం బాబు’ స్లోగన్ ముద్రించుకుని పలు ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నారు.

త్వరలో ఈ స్లోగన్ ఎత్తైన హోర్డింగ్స్ మీద కూడ దర్శనమివ్వనున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి వైకాపా శ్రేణులు.ఇక నియోజకవర్గాల్లోని గ్రామాల్లో 3 నుండి 7వ తేదీ వరకు రోజుకి 2 చొప్పున సమావేశాలు నిర్వహించాలని, ఈ క్యాపైనింగ్ కు మద్దతుగా జనాల ద్వారా ఒక ఫోన్ నెంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చేలా చేయాలని, ర్యాలీలు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇలా సొంత ఎలివేషన్ కంటే బాబును కిందికి దించడంలోనే సర్వ శక్తులు ఒడ్డుతున్న జగన్ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.