విజ‌య‌వాడ రాజ‌కీయాల‌లో వంగ‌వీటి ఏ గ‌ట్టు కొస్తారో..!

vangaveeti radha
vangaveeti radha

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వంగ‌వీటి గుడ్ బై చెప్పారు. ఆంద్ర రాజ‌కీయాల‌కు వేదికైన విజ‌య‌వాడ‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. కొన్నాళ్ల నుంచి అసంతృప్తితో ర‌గిలిపోతున్న వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతూ రాజీనామా లేఖను అందించారు. మీకు సీఎం కావాలని కోరికతో పరిమితులు పెడితే.. తాను ఎమ్మెల్యే కావాలని పరిమితుల నుండి దూరం అవుతున్నాను అంటూ వైసీపీ అధినేతకు లేఖలో విమర్శ‌నాస్త్రాలు సంధించారు. నాలుగు నెలల తొమ్మిది రోజులు ఓపికగా వేచి చూసానన్న ఆయ‌న‌, తండ్రి అడుగుజాడల్లో నడవాలని పార్టీ వీడానని వెల్ల‌డించారు.

మరో రెండు రోజులలో తమ అనుచరులు, అభిమానులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాను ఏ గ‌ట్టు కొస్తాన‌నేది రెందు రోజుల్లో డిసైడ్ అవుతుంద‌ని వంగ‌వీటి స్ప‌ష్టం చేశారు.విజయవాడ రాజకీయాలలో అన్ని సమీకరణాలు అంచనా వేసుకొని అడుగేయాల్సిందే. సామాజిక సమీకరణాలలో చూస్తే, అక్కడ బలమైన సామాజిక వర్గాలలో ఒక సామజిక వర్గానికి చెందిన వంగవీటి కుటుంబం మీద అందరి చూపు నిలుస్తుంది.వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాలలో అరంగేట్రం చేసిన రాధా, రానున్న ఎన్నికలకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.

రాష్ట్ర రాజకీయాలను శాసించిన కుటుంబం నుండి వచ్చిన అయన దారెటూ అనేది కేడ‌ర్ లో ఉత్కంఠ‌గా మారింది. ఇటు ఇప్పటికే టీడీపీతో చర్చలు జరిగాయని అంటున్నారు. అటు జనసేన పార్టీతో సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రచారం జ‌రుగుతోంది. మొత్తం మీద వంగ‌వీటి ప‌య‌న‌మెటు అనేది ఏపి పాలిటిక్స్ లో సెన్సేష‌న్ గా మారింది.