గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగ‌మా … అబ‌ద్దాల క‌ర‌ప‌త్రామా ..! – వైసిపి

srikanth-reddy
srikanth-reddy

అసెంబ్లీ సాక్షిగా గవర్నర్‌ చేత 40 పేజీల అబద్ధాలు చదవించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శ్రీకాంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. గవర్నర్ నరసింహన్‌ ప్రసంగం అబద్ధాల కరపత్రమని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌ టీడీపీ అబద్ధాల కరపత్రం చదవడం దురదృష్టకర‌మ‌న్నారు. అది ఏపీ ప్రజలు వినాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

హైద‌రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నిలకు ముందు టీడీపీ ప్రభుత్వం పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇచ్చి ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తోందని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనపై ప్రోగ్రెస్‌ రిపోర్టు తీసుకుని ఎన్నికలకు వెళ్లకుండా శ్వేత పత్రాలు, కొత్త హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.