శ్రీవారి సేవ‌లో వైసిపి అధిన‌త జ‌గ‌న్…!

YS Jagan

వైసీపీ అధినేత జగన్ కాలినడకన తిరుమల కొండపైకి నడిచివెళ్లి సామాన్య భక్తుల మాదిరి క్యూలైన్లో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలను ధరించిన జగన్ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శనానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.జగన్ వెంట వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.కొండపైన ఆలయ అధికారులు జగన్ కి స్వాగతం పలికారు.జగన్ వెంట అయన అనుచరులు కూడా భారీగా తిరుమలకు వెళ్లారు.

జగన్ తిరుమలకు చేరుకోగానే టీటీడీ వేదపాఠశాల పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.అయితే జగన్ వెంట మీడియాను చూసి పూర్ణకుంభం పక్కన పెట్టేసి వేదాశీర్వచనం చేశారు. అసలు వేదపాఠశాల నుండి పండితులు రావడం.. ఆపైన పూర్ణకుంభంతో స్వాగతం పలికేందుకు ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి.