వైఎస్ఆర్ బయోపిక్:యాత్ర ట్రైలర్ రివ్యూ

Yatra
Yatra

యాత్ర….దివంగత ప్రజా నేత YSR జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర.ఈ సినిమా టీజర్ తోనే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.దాంతో ఈ సినిమా టీమ్ మరింత కాన్ఫిడెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు.ట్రైలర్ లో మొదటి షాట్ లోనే హై కమాండ్ ని దాటి YSR తీసుకున్న నిర్ణయంగా పాదయాత్రను ఎస్టాబ్లిష్ చేసారు.ట్రైలర్ లో మమ్ముట్టి హావభావాలు అన్నీ కూడా YSR లానే ఉన్నాయి.అలానే చేయించారు.కానీ ఒక్క డైలాగ్ ఫ్లో విషయంలో మాత్రం రాజీ పడాల్సి వచ్చింది.

రాజశేఖర రెడ్డి పెక్యులియర్ మాడ్యులేషన్ చాలా కష్టం కాబట్టి స్ట్రైన్ తీసుకోలేదు.చాలా రియల్ ఇన్సిడెంట్స్ ని తీసుకుని రియలిస్టిక్ గా తెరకెక్కించడం,మమ్ముట్టి లాంటి ట్యాంలెంటెడ్ స్టార్ ఆ పాత్ర పోషించడంతో సినిమాకి కీలకమయిన ఎమోషన్స్ చాలా సహజంగా,బలంగా పండినట్టు కనిపిస్తున్నాయి.ఈ సినిమాని చాలా ఖర్చుతో అన్ కంప్రమైజ్డ్ గా నిర్మించారు ప్రొడ్యూసర్స్.ఇక ఈ సినిమాలో YSR భార్య విజయమ్మ పాత్రలో బాహుబలి-2 ఫేమ్ ఆశ్రిత వేముగంటి నటిస్తుంది.

ఇక ఈ సినిమాలో జగన్ పాత్రను రివీల్ చెయ్యలేదు.YSR ని పోటీలకు అతీతంగా అందరూ అభిమానించేలా చేసే పాదయాత్ర నేపథ్యాన్నే ఫుల్ ప్లెడ్జెడ్ గా ఎలివేట్ చేస్తున్నారు.ఈ సినిమా వల్ల YSR కాంగ్రెస్ లాభ పడాలి అని చూస్తుంది.కానీ సినిమాలోమాత్రం ఎక్కువగా కాంగ్రెస్ జండాలు కనిపిస్తున్నాయి.సో,ఈ సింపతీ ఎటు షిఫ్ట్ అవుతుందో ఏమో?.

 

Yatra Movie Trailer