యాత్ర రిలీజ్ కి NTR బ్రేక్

Yatra
Yatra

పండగ సినిమాల్లో ముందుగా థియేటర్స్ లోకి వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు బ్లాక్ బస్టర్ అనిపించుకోలేకపోయినా క్రిటిక్స్ నుండి,ప్రేక్షకులనుండి కూడా ఒక మోస్తరు టాక్ దక్కించుకుంది.కానీ ఆ సినిమా కలెక్షన్స్ చాలా డ్రాప్ అయ్యాయి.దాంతో ఈ సినిమా కొనుకున్న ప్రతి ఒక్కరికి భారీ నష్టాలు అనేది కన్ఫర్మ్ అయిపోయింది.

సినిమా స్లో పేస్ నెర్రేషన్ సినిమా బాక్స్ ఆఫీస్ నంబర్స్ ను శాసించింది.దీంతో ఫిబ్రవరి 7 అని రిలీజ్ డేట్ ఇచ్చిన మహాయకుడు సినిమా కి రీపెయిర్స్ చెయ్యబోతున్నారు.దీంతో ఈ సినిమా ఫిబ్రవరిలో రావడం కష్టం అని టాక్.ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ వల్ల మిగతావాళ్ళకి ఎవ్వఁరికి ఇబ్బందిలేకపోయినా ఈ సినిమాతో ఎలాంటి సంబంధం లేని యాత్ర టీమ్ ఆందోళన పడుతుంది.ఎందుకంటే ఈ సినిమాని ఎన్టీఆర్ మహానాయకుడు కి అపోజిట్ గా రిలీజ్ చేసి లాభం పొందాలని ఒక పొలిటికల్ పార్టీ తో టీమ్ టై అప్ అయ్యింది.

అందుకే ఇప్పటివరకు ఆపి సినిమా రిలీజ్ ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసారు.కానీ లాస్ట్ మినిట్ లో కథానాయకుడు ఫలితం మహానాయకుడుని ప్రభావితం చేసింది.దాంతో యాత్ర టీమ్ డైలమాలో పడింది.పోటీ అనివార్యం అన్ని కొన్ని సినిమాలు సతమతమవుతుంటే పోటీ పై క్లారిటీ లేక యాత్ర ఇబ్బందిపడుతుంది.మహానాయకుడు ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో,యాత్ర టీమ్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతుందో చూడాలి.