షాకిస్తున్న యాత్ర ఫస్ట్ డే కలెక్షన్స్

Yatra
Yatra

దివంగత నేత YSR ని జననేతగా మార్చి అధికార పీఠంపై కైవసం చేసుకోవడానికి ముఖ్యమయిన పాదయాత్ర గట్టంతో తెరకెక్కిన యాత్ర కి మొదటిరోజే సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.YSR అభిమానములను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో అనే డౌట్ అందరిలో ఉంది.కానీ యాత్ర మాత్రం టాక్ కి తగ్గ రీతిలో వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది.

తెలుగు రాష్టాల్లో మొదటోరోజే 4 కోట్ల పై చిలుకు కలెక్షన్స్ సాధించింది.లిమిటెడ్ అప్పీల్ కంటెంట్ తో వచ్చిన సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు అంటే మాటలు కాదు.ఇక అందరి అంచనాలు తల్లక్రిందులు చేస్తూ ఓవర్సీస్ లో సైతం ప్రీమియర్స్,ఫస్ట్ డే కలుపుకుని ఏకంగా లక్ష డాలర్స్ కి పైగా సంపాదించింది.

అక్కడ సినిమాని రెండు కోట్లకు అమ్మారు,మొత్తంగా 13 కోట్లకు అమ్మారు.ఈ కలెక్షన్ జోరు చూస్తుంటే ఫస్ట్ వీక్ ఎండ్ లోనే సినిమా బ్రేక్ ఈవెన్ కి చేరుకునేలా ఉంది.సోమవారం నుండి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అనే దానిపై ఈ సినిమా ఎండ్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.ఇవ్వాలన్న ట్రెండ్ నెక్స్ట్ వీక్ లో కూడా కొనసాగితే మాత్ర యాత్ర వసూళ్ల జాతర 18 కోట్లకు రీచ్ అవ్వడం ఖాయం.