శరవేగంగా ‘కేజీఎఫ్ 2’ షూటింగ్…!

KGF Chapter 2
KGF Chapter 2

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా నటించిన చిత్రం కేజీఎఫ్ చాప్టర్- 1.ఇటీవల విడుదల అయ్యి ఈ సినిమా సంచలనం సృష్టించింది. కన్నడ,హిందీ,తమిళ,తెలుగు భాషలలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్ల సునామీ సృష్టించడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లు రాబట్టింది. కాగా ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది.ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వివరాలు చిత్రయూనిట్ తెలియజేసింది. ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో సాగుతుండగా మరికొద్ది రోజుల్లో మైసూర్ లో ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలిపారు.ఆఖరిగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బళ్లారిలో భారీ షెడ్యూల్ ఉండనున్నట్లు తెలియజేశారు. అప్పటికి షూటింగ్ దాదాపు 80-90శాతం పూర్తవుతుంది అని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. చాప్టర్ 2లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్,సీనియర్ కథానాయిక రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.