యాదగిరిగుట్టలో మోడల్ బస్‌స్టేషన్ ,మల్టీప్లెక్స్ , ఫుడ్‌కోర్ట్సు , వెయిటింగ్‌ హాల్‌

Telangana, Busstation, YadagiriGutta, Sydapuram, Reganalmanagar, Yadadri, Multiplex, Foodcourt, WaitingHall,

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేబట్టిన యదాద్రి పునఃనిర్మాణ పనులు శరవేగంగా పుర్తవుతున్నాయి. ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే భక్తులకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలనే ఉండాలని ,ఈ ఉద్దేశ్యంతో ప్రభుత్వం గుట్ట లో మోడల్‌ ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయబోతోంది. దీనికోసం 14 ఎకరాల భూమిని కేటాయించినట్లు ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తెలియచేసారు.

సైదాపురం పరిధిలో 10 ఎకరాల్లో బస్‌డిపో ను , యాదాద్రి కొండ వెనుక 4 ఎకరాల్లో బస్‌స్టేషన్ నిర్మించున్నట్టు తెలిపారు. దీనికి మరో ఎకరం స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్‌కు సూచించామన్నారు. అంతేకాకుండా మల్టీప్లెక్స్, ఫుడ్‌కోర్ట్సు, వెయిటింగ్‌ హాల్‌తోపాటు ఏసీ మీటింగ్ ‌హాల్ కూడా నిర్మిస్తామని తెలియచేసారు..