విడిపోయిన‌ట్లుగా న‌టిస్తున్నారు వారిద్ద‌రు – జ‌గ‌న్

Y. S. Jaganmohan Reddy comments on Pawan Kalyan and N. Chandrababu Naidu
Y. S. Jaganmohan Reddy comments on Pawan Kalyan and N. Chandrababu Naidu

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో పొత్తుల ఎత్తుల‌పై ఆ యా పార్టీల అధినేత‌ల స్వ‌రాలు పెంచారు. ఇప్ప‌టికే తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు త‌న‌తో క‌ల‌సి రావాల‌ని జ‌న‌సేన‌ అధినేత ప‌వ‌న్ ని ఆహ్వానించారు.

అయితే తాము వామ‌ప‌క్షాలు మిన‌హా మ‌రెవ‌రితోనూ పొత్తు పెట్టుకునేది లేద‌ని జ‌న‌సేనాని ఖ‌రాఖండిగా తేల్చేశారు. తాజాగా పవన్ , తాను కలిస్తే… జగన్ కు ఎందుకు బాధ ? అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. వారిద్ద‌రూ క‌లిస్తే త‌న‌కు బాధేంట‌ని ప్ర‌శ్నించారు. ఇంతకు ముందు కలిసి పోటీ చేశారు మీరు. ఇప్పుడు విడిపోయినట్టుగా నటించి మోసం చేస్తావున్నారు.

ఎందుకు ప్రజలను మీరు మోసం చేస్తారు. కలిసికట్టుగా ముసుగు తీసే రండి అంటూ జ‌గ‌న్ స్వ‌రం పెంచారు. త‌న‌కు భయం లేద‌ని, ప్రజలు, దేవుడు మీద వుంద‌ని, ఒక్కడినే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతాన‌ని ప్ర‌తిప‌క్ష నేత,వైసిపి అధినేత జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.