చంద్ర‌బాబువి మాయ‌మాట‌లే – జ‌గ‌న్

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

2014 ఎన్నికల ముందు చంద్రబాబు మాయమాటలు చెప్పారని, మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి మళ్లి అలాంటి మోసాలే కనిపిస్తున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జ‌గ‌న్ ధ్వ‌జ‌మెత్తారు . ఐదేళ్లలో రాష్ట్రంలో చంద్రబాబు చేసింది శూన్యమన్నారు ఆయ‌న‌. విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్ర‌సంగించారు.

వైఎస్‌ హయాంలో తోటపల్లి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశారని, మిగిలిన 10 శాతం పనులు కూడా చంద్రబాబు ప్రభుత్వం చేయలేక పోయిందన్నారు. 80 వేల ఎకరాలకు ఇంకా సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. దేశమంతా తిరిగే చంద్రబాబుకు పక్కనే ఉన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ను కలుసుకునే ధ్యాస లేదని ఎద్దేవా చేశారు వైసిపి అధినేత జ‌గ‌న్‌.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తలపెట్టిన జంఝావతి రబ్బర్‌ డ్యామ్‌ను బాబు నిర్లక్ష్యం చేశార‌ని ఆయన మండిపడ్డారు . ఒడిశా సీఎంతో చర్చలు జరిపి రబ్బర్‌ డ్యామ్‌ను అందుబాటులోకి తీసుకురావ‌చ్చ‌ని హితవు పలికారు.