స‌బిత చూపు కారు వైపు ..?

sabitha indra reddy
sabitha indra reddy

తెలంగాణ‌లో హ‌స్త‌వాసి బాగోలేద‌ని ఢీలాప‌డుతోన్న కాంగ్రెస్ నేత‌ల‌పై ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ అస్త్రాన్ని టిఆర్ ఎస్ ప్ర‌యోగించ‌బోతోంది. చావుత‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన నేత‌ల‌ని టార్గెట్ గా కారు స్పీడ్ పెంచ‌నుంది.ఈ నేప‌ధ్యంలో మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల‌కు అధికార పార్టీ వ‌ల‌వేసి ఆఫ‌ర్ ఇస్తోంద‌ని తెలంగాణ రాజ‌కీయాల‌లో జోరుగా ప్ర‌చారం అవుతోంది.మాజీ హోంమంత్రి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహా కొంద‌రు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అధికార టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధమైనట్లు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.సంక్రాంతి తర్వాత ఈ చేరికలు ఉంటాయని తెలుస్తోంది.

ముందుగా పార్టీలో చేరతారని భావిస్తున్న సబితా ఇంద్రారెడ్డికి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో చోటు క‌ల్పిస్తార‌ని ప్ర‌చారం అవుతోంది.ఒక‌వేళ ఆ చాన్స్‌ దక్కకపోతే ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ ఇస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం నుంచి కార్తీక్‌కు సీటు ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నది టీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి తెలుస్తోంది.చెవేళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున కొండా విశ్వేశ్వర్‌రెడ్డికే అవకాశం దక్కుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సబితారెడ్డి కారెక్కేందుకు ఆశ‌ప‌డుతున్నార‌ని ప్ర‌చారం అవుతోంది.