కీల‌క శాఖ‌ల‌ను సిఎం కేసీఆర్ ఎందుకు కేటాయించ‌లేదో తెలుసా..!

new cabinet ministers
new cabinet ministers

తెలంగాణ క్యాబినెట్ ను విస్త‌రించిన సిఎం కేసీఆర్ ప‌ది మంది మంత్రులకు శాఖలను కేటాయించారు.సీఎం కేసీఆర్ తో పాటు ప్రమాణస్వీకారం చేసిన మహమూద్ అలీకి ఇప్పటికే హోంశాఖ కేటాయించగా, తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించారు.

ఈటల రాజేందర్- వైద్యాఆరోగ్యం
తలసాని శ్రీనివాస్‌యాదవ్- పశుసంవర్థకశాఖ
గుంటకండ్ల జగదీష్‌రెడ్డి- విద్యాశాఖ
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి- న్యాయశాఖ, దేవాదాయ, అడవులు, పర్యావరణం,
వేముల ప్రశాంత్ రెడ్డి- రవాణా, రోడ్లు భవనాలు
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి- వ్యవసాయశాఖ
కొప్పుల ఈశ్వర్- సంక్షేమశాఖ
ఎర్రబెల్లి దయాకర్‌రావు- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్
వి. శ్రీనివాస్‌గౌడ్ ఎక్సైజ్- పర్యాటకం, క్రీడలు
చామకూర మల్లారెడ్డి- కార్మిక, ఉపాధి, మానవవనరుల అభివృద్ధి

అయితే కీలకమైన శాఖలను, గతంలో హరీష్ రావు, కేటీఆర్ నిర్వరించిన శాఖలను సిఎం కేసీఆర్ త‌న వ‌ద్ద‌నే వుంచుకున్నారు. ఆర్థిక, రెవెన్యూ, భారీ నీటిపారుదల, మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖలను కేసీఆర్ మంత్రులెవరికీ కేటాయించలేదు. వీటిలో ఆర్థిక, రెవెన్యూ శాఖలను మినహాయిస్తే మిగతా శాఖలన్నీ గతంలో కేటీఆర్, హరీశ్ నిర్వహించినవి కావడం గ‌మ‌నార్హం . ఈ నెల 22 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. మంత్రులకు శాఖలను కేటాయించినా ఆర్థికశాఖను సీఎం కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. దీంతో ఈ నెల 22వ తేదీన తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు.