ఎవరు అన్నారు ? ఏపీ నాదే.. తెలంగాణ నాదే

AndharaParadesh, Telangana, NaraChandrababu, Twitter,

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు ఎవరంటే ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పై. మంగళవారం అనంతపురం జిల్లా ఎర్రమంచిలో కియా కార్ల సంస్థలో ప్రయోగాత్మక ఉత్పత్తి ఆరంభించారు.ఈ సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు ట్విటర్‌ పై స్పందిస్తూ.. కొన్నేళ్ల క్రితం అనంతపురం జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వస్తాయంటే ఎవ్వరూ నమ్మవారు కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషి , పట్టుదల తో జిల్లాకు నీటి సరఫరా అందించాం. దీని ద్వారా జిల్లాలో మరెన్నో భారీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది అని అన్నారు.

దీనిపై రామ్‌ స్పందిస్తూ.. ఇది నిజమే.. మన రాష్ట్రానికి ఇది భారీ ముందడుగు అని. మున్ముందు ఇలాంటివి మరెన్నో వస్తాయి అని తెలిపారు. రామ్‌ ఈ ట్వీట్‌ చేయగానే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మద్దతు తెలుపుతున్న ఏకైక హీరో రామ్‌ అంటూ నెటిజన్లు ప్రశంసించారు. ఈ కామెంట్లపై రామ్‌ .. నా ఇల్లు సక్కపెట్టేటోడు ఎవరైతే నాకేంటి ‌.. నువ్వు మంచి చెయ్‌.. నీకూ ఇస్తా ఓ ట్వీటు . ఆంధ్రా నాదే మరి తెలంగాణ నాదే. ఇదే మాట మీదుంటా . ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు, చర్చ అసలు లేవు . నేను పౌరుడిని ఆ తర్వాతే నటుడ్ని అని వెల్లడించారు రామ్‌.