ఈ పాత్ర ఎవరిదో చెప్పగలరా.. వర్మ మరో బాంబు …!

Varma, Ramgopal Varma, Lakshmi's NTR, Laxmiparvathi, Sreereddy, Firstlook, Kannada, Heroin, Killing Veerappan, Yaghna Shetty, Twitter, Treet, Photos, Images,

వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మి ఎవరో తెలుసా… ! అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి వివరాలు లోకి వస్తే
ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన అసలు నిజనల్ను నేను బహిర్గతం చేస్తానని చెప్తూ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో నే సినిమా రూపొందిస్తున్న విషయం తెలుసు కదా. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి జీవితాన్ని లైన్ గా తీసుకుని ఆమె ఎంట్రీ నుండి ఈ సినిమా ఉండనుండటంతో సర్వత్రా ఆసక్తి ఉంది అందరకూ . ఇక సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్ర ఎవరు పోషించనున్నారనే అంశం మీద చాలానే లీకులు వచ్చాయి వస్తునాయి . ఈ మూవీ లో వివాదాస్పద నటి శ్రీ రెడ్డి నటిస్తోందని ఇలా రకరకాలుగా ప్రచారాలు జరగడంతో ఈ విషయం గురించి సినీప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దానికి దీటుగారాం గోపాల్ వర్మ ఆ ఉత్కంఠకు తెరదించుతూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో లక్ష్మీ పార్వతి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

 

కన్నడ నటి యజ్ఞ శెట్టి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి పాత్రలో నటించానున్నారని రాంగోపాల్ ప్రకటించాడు. కన్నడ సీమలో నటిగా మంచి గుర్తింపు సాదించిన యజ్ఞ పలు కన్నడ సినిమాల్లో హీరోయిన్‌ గా నటించారు. వర్మ దర్శకత్వంలో ఒకప్పుడు తెరకెక్కిన ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్రలో కూడా యజ్ఞ నటించారట . ఎలా మేకోవర్ చేశారో తెలీదు కానీ మొత్తానికి లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞ శెట్టి నప్పేట్టే ఉంది. దర్శకుడు వర్మ ట్విటర్ ద్వారా ఈ పాత్రకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు.