బిగ్ బాస్ 3 కి హోస్ట్ ఎవరు ?

venkatesh
venkatesh

విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఎఫ్ 2 cinema (12 జనవరి) భారీస్థాయిలో విడుదల కానుంది. దీంతో ఎఫ్ 2 సినిమా ప్రమోషన్స్ లో వెంకటేశ్ బిజీగా బిజీగా వున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకటేశ్ మాట్లాడుతూ .. బిగ్ బాస్ 3 షోకి తాను హోస్ట్ గా వ్యవహరించనున్నానంటూ జరుగుతోన్న ప్రచారాన్ని గురించి ప్రస్తావిన వచ్చింది. బిగ్ బాస్ 3 షోకి తాను హోస్ట్ గా చేయనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు అని అన్నారు. ఇదంతా కేవలం రూమర్ మాత్రమే అని స్పష్టం గా తెలిపారు.

కాగా బిగ్ బాస్ 3 నిర్వాహకులు వెంకటేశ్ తో సంప్రదింపులు జరుపున్నారు. ఈ వార్త తరువాత నే మెగా స్టార్ చిరంజీవి పేరు కూడా తెరపైకి వచ్చి నది. మరి ఈ అంశం పై చిరంజీవి ఏమంటారో .. బిగ్ బాస్ 3 కి హోస్ట్ ఎవరు ? ఎవరు వ్యవహరించేది ఆసక్తికరంగా మారింది.