దేశ భక్తి లో టాప్ స్టార్లే ….

Star, Celebs, Donations, Indian, Soldiers,

ఘటనకు స్పందిస్తే దేశభక్తులు అయినట్టేనా? కాదు అవునా .. స్పందించడంతో పాటు.. కష్టంలో ఆదుకునేందుకు ఆర్థిక సాయం ప్రకటిస్తేనే నిజమైన దేశభక్తులుగా నిరూపించకున్నట్టు కదా . అక్షరాలా ఈ సూత్రాన్ని తూ.చ తప్పక ఆచరిస్తూ శహభాష్ అనిపిస్తున్నారు కొందరు స్టార్లు. ఈ విషయంలో యువ స్టార్లు – స్టారాధిస్టార్లు గ్రేట్ అని కూడా నిరూపించుకుంటున్నారు. జమ్ము కశ్మీర్ బార్డర్ – పుల్వామా ఘటనలో దారుణ ఘటనపై స్టార్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా .. జవాన్ల కుటుంబాలకు మేం అండగా నిలుస్తాం అంటూ భారీగా విరాళాలు ప్రకటించారు .ఇది చాలా ఆ సక్తిగా ఉంది. ప్రధాని నిధి కి సెలబ్రిటీల నుంచి కోట్లలో సొమ్ము జమ అయ్యిందని తాజా సన్నివేశం చెబుతోంది.

టాలీవుడ్ స్టార్లలో విజయ్ దేవరకొండ తొలిగా ఆర్థిక సాయం విషయమై స్పందింఛి తన వంతు చెక్ ని పీఎంవోకి పంపించారు. ఆ తర్వాత ఎందరో స్టార్లు ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రకటనలు చేసారు. వీళ్లలో బిగ్ బి అమితాబ్ తనవంతు సాయానికి ముందుకొస్తున్నానని ప్రకటించడమే గాక ప్రజలంతా పెద్ద ఎత్తున స్పందించాలని కూడా తెలిపారు . అటుపై సల్మాన్ భాయ్ కూడా ఇదే తీరుగా ఉన్నారు . విజయ్ దేవరకొండ.. ఇలయదళపతి విజయ్.. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ – అజయ్ దేవగన్ – అమితాబ్ – అక్షయ్ తదితరులు విరాళాలు ప్రకటించేసారు. ఇప్పటికే ఆర్థిక విరాళాలు ప్రకటించిన స్టార్లలో కిలాడీ అక్షయ్ మరో ఒక సారి తనదైన శైలిలో మనసు దోచారు. అక్షయ్ ఏకంగా 5 కోట్ల మేర ప్రకటించి సంచలనాన్ని సృష్టించారు. దేశభక్తి ప్రధాన చిత్రాల్లో నటించడమే కాదు.. సందర్భం వస్తే తనలోని దేశభక్తిని ప్రదర్శించే అవకాశం అస్సలు వదులుకోనని అక్షయ్ తన శైలి లో నిరూపించారు.

ఆ తర్వాత హీరో సల్మాన్ ఖాన్ 2.5 కోట్ల మేర ఆర్థిక సాయం చేసారు. మరో స్టార్ హీరో అజయ్ దేవగన్ ధీటుగానే సపందించి `టోటల్ ధమాల్` టీమ్ తరపున రూ.50లక్షల ఆర్థిక సాయం పీఎంవోకి అందుతుందని ప్రకటించారు. 40 మంది సైనికుల కుటుంబాలకు ఈ మొత్తం చేరుతుందని తెలిపారు. దేవగన్ నిర్మాతలు ఇతర నటీనటులు కలిసి ఇందులో తలో కొంత సాయం చేసారు. వీళ్లతో పాటు మునుముందు అమీర్ ఖాన్ – షారూక్ ఖాన్ వంటి స్టార్లు తమ ఆర్థిక విరాళాల్ని ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇంకా టాలీవుడ్ కోలీవుడ్ స్టార్ల నుంచి ఇతర పరిశ్రమల స్టార్ల నుంచి విరాళాలు వెల్లువెత్తే అవకాశం ఉందని అంచనా . టాలీవుడ్ నుంచి పలువురు బిగ్ స్టార్లు బిగ్ షాట్స్ కూడా తమ ఆర్థిక సాయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు అందిన సమాచారం మేరకు మూవీ ఆర్టిస్టుల సంఘం `మా` రూ.5లక్షల ఆర్థిక విరాళాన్ని ప్రకటించడం చాలా విశేషం. ఆ మేర అధ్యక్షకార్యదర్శులు శివాజీ రాజా – నరేష్ ఇనిషియేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.