వేర్ ఈజ్ వెంకటలక్ష్మి రివ్యూ

Where Is The Venkatalakshmi Review in Telugu
Where Is The Venkatalakshmi Review in Telugu

నటీనటులు : రాయ్ లక్ష్మీ , నవీన్ నేని, పూజిత పొన్నాడా, మహాత్, మధునందన్, ప్రవీణ్ మరియు పంకజ్ త‌దిత‌రులు.
దర్శకత్వం : కిషోర్ కుమార్
నిర్మాత : ఎం. శ్రీధర్‌ రెడ్డి, హెచ్‌. ఆనంద్‌ రెడ్డి, ఆర్కే రెడ్డి.
సంగీతం : హరి గౌర
స్క్రీన్ ప్లే : కిషోర్ కుమార్
ఎడిటర్ : యస్ అర్ శేఖర్
విడుదల తేదీ : మార్చి 15, 2019
రేటింగ్ : 2/5

హారర్ అనే జోనర్ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాకపోయినా,వారానికి ఒకటో రెండో హారర్ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నా కూడా అదే జోనర్ లో తెరకెక్కిన వేర్ ఈజ్ వెంకటలక్ష్మి గురించి మాత్రం కొంతమంది ఎదురుచూసారు.కామెడీ బాగా చేసే ప్రవీణ్,మధు నందన్ ఫస్ట్ టైం ప్రధాన పాత్రల్లో నటించడం,లక్ష్మి రాయ్ ఈ సినిమాలో లీడ్ రోల్ చెయ్యడం,ట్రైలర్ కూడా కామెడీ,రొమాన్స్ అండ్ హారర్ లను మిక్స్ చేస్తూ ఎదో కొత్తగా కనిపించడం తో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.మరి ఈ సినిమా ఆ ఇంట్రెస్ట్ ని నిలబెడుతూ విజయం సాధించిందా లేక బాబోయ్ అంటూ నిజంగానే భయపడేలా చేసిందా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ: పండు ,చంటి బెల్లంపల్లి అనే పల్లెటూళ్ళో ఉండే పనీపాటాలేని బేవార్స్ బ్యాచ్.అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఊళ్ళో వాళ్లందరితో గొడవలు పెట్టుకుంటారు.అయితే ఆ ఊరికి కొత్తగా వచ్చిన వెంకటలక్ష్మి మాత్రం వాళ్ళతో సరదాగా,చనువుగా ఉంటుంది.దాంతో వాళ్ళని ఆమె ప్రేమిస్తుంది అనే కంక్లూషన్ కి వస్తారు.కానీ అదే టైం లో ఆమె దయ్యం అని తెలుస్తుంది.అయితే ఆ దెయ్యం వాళ్లకు డెడ్ లైన్ పెట్టి ఒక టాస్క్ ఇస్తుంది.అసలు వెంకటలక్ష్మి ఎవరు?,ఆమె దయ్యంగా ఎందుకుమారింది?,ఆ ఊరు వచ్చి పండు,చంటి ల వెంట ఎందుకుపడింది?ఆమె వాళ్లకు ఇచ్చిన టాస్క్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?….ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం గా రూపొందింది ఈ సినిమా.

విశ్లేషణ: హారర్ కామెడీ అనే జోనర్ ముఖ్య ఉద్దేశం నవ్విస్తూ ప్రేక్షకులను థ్రిల్ చెయ్యడం.అయితే ఈ జోనర్ టచ్ చేసే తప్పుడు అంతకుముందు జనాలపై తమ ముద్ర వేసిన కాంచన సిరీస్,ప్రేమకథాచిత్రం లాంటి సినిమాల రేంజ్ లో కంటెంట్ ఉండేలా చూసుకోవాలి.లేకపోతే సినిమా తేలిపోతుంది.అయితే వేర్ ఈజ్ వెంకటలక్ష్మి మాత్రం అటు చీప్ కామెడీ తో నవ్వించలేక,సరయిన సీన్స్ తో భయపెట్టలేక,అర్ధం పర్ధం లేని సీన్స్ తో,కనీసమయిన లాజిక్ లేని కంటెంట్ తో విసిగిస్తూ సాగుతూ సాగుతూ సహనానికి పరీక్ష పెడుతూ హమ్మయ్య సినిమా పూర్తయిపోయింది అనిపించింది.ఈ సినిమాలో కథ రొటీన్…కానీ నవ్వించడానికి స్కోప్ ఉంది,భయపెట్టే సీన్స్ రాసుకునే అవకాశం ఉంది,ఎమోషన్ ని బలంగా చెప్పే అవసరం ఉంది….కానీ ఈ సినిమా రైటర్ అండ్ డైరెక్టర్ ఆ రెండు విషయాల్లో పూర్తిగా అశ్రద్ధ గా పనిచేయడంతో వేర్ ఈజ్ వెంకటలక్ష్మి హారర్ కంటెంట్ కంటే ఆ సినిమాలోని చెత్త కంటెంట్ తో ఎక్కువ భయపెట్టింది.ఇచ్చిన పాత్రలను సజీవంగా తెరపైకి తీసుకురాగల ఆర్టిస్టులు,సినిమాకి అవసరమైన వనరులు ఉండి కూడా సినిమాని ఇంత దారుణంగా తీర్చిదిద్దడం అనేది చాలా దారుణమయిన విషయం.సెకండ్ హీరోయిన్ పూజిత పొన్నాడ ఇంట్రడక్షన్ సీన్ బస్ లో ఉంటుంది.ఆమెని రివీల్ చేస్తున్నపుడు గులాబీ రేకలు పైనుండి పడుతుంటాయి.అవి ఎలా పడ్డాయి?…ఇది ఇంట్రడక్షన్ సీన్ లో ఇల్లాజికల్ సీన్…దీంతో మొదలు పెట్టి అడుగడుగునా ఒక్కో సీన్ ఒక్కో ధారుణం చూపిస్తూ ఇంటర్వెల్ కే సినిమా భయపెట్టిస్తుంది.ఇక ఇంటర్వెల్ తరువాత అయితే అరాచకం పీక్స్ లో ఉంటుంది.ఏ సీన్ ఎందుకు వస్తుందో తెలియదు.హీరో ఉండేది ఒక ఒళ్ళో ,హీరోయిన్ ఉండేది ఒక ఊళ్ళో కానీ ఎప్పుడుపడితే అప్పుడు ఒకరికి ఒకరు ఎదురుపడుతుంటారు.హీరోయిన్ హీరో ని ఎందుకు ప్రేమిస్తుందో తెలియదు,ఎందుకు వద్దనుకుంటుందో తెలియదు?.ఊరు భవిష్యత్తుకు సంబందించిన ఒక క్రిటికల్ ప్రాబ్లెమ్ ని సాల్వ్ చెయ్యడానికి ఊరంత కలిసి పోరంబోకులు అయిన పండు,చంటి లను ఎందుకు ఎంచుకుంటారో తెలియదు.ఇలా ఈ సినిమాలో లోపాలు రాసుకుంటూ పోతే ఈ సినిమా ఒరిజినల్ స్క్రిప్ట్ కంటే పెద్ద పుస్తకం అవుతుంది.ఆ లోపాలు సరిచేసి మళ్ళీ ఇదే కథని తీసినా మినిమమ్ రేంజ్ లో ఆకట్టుకుంటుంది.

నటీనటులు: ఎప్పటినుండో సినిమాలు చేస్తున్న రాయ్ లక్ష్మి టైటిల్ ని అలవోకగా చేసుకుపోయింది.ఆమె నటనని ఛాలెంజ్ చేసేంత దమ్ము రాసుకున్న పాత్రలో లేదు,ఇక ఆమె నుండి ప్రేక్షకులు కోరుకునే గ్లామరసం కూడా బాగానే అందించింది.తమ నాచురల్ కామెడీ తో ప్రేక్షకులను అలరించే ప్రవీణ్ అండ్ మధు నందన్ తమ శక్తి వంచన లేకుండా వాళ్ళ రోల్స్ ని పోషించారు.కానీ నవ్వించిన సందర్భాలు రెండు,మూడుకి మించి లేవు.రంగస్థలం,బ్రాండ్ బాబు లాంటి సినిమాల్లో పద్దతిగా కనిపించిన పూజితా పొన్నాడ ఈ సినిమాలో మాత్రం అడ్డులేకుండా,ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా అందాల విందుకు ఓకే చెప్పింది.నటన పరంగా కూడా మెప్పించింది.మిగతా వాళ్లలో ఎక్కువమంది ఓవర్ యాక్షన్ చేసి విసిగించారు.

టేక్నీషియన్స్:అసలు ఈ సినిమా డైరెక్టర్ కిషోర్ ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీసాడో అర్ధం కాదు.అడుగడుగునా అసంబద్దమయిన సీన్స్ తో తలనొప్పి వచ్చేలా ఈ సినిమా తీసాడు.అతని జడ్జి మెంట్ స్కిల్స్ అండ్ డైరెక్టోరియల్ స్కిల్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.ఇక ఈ సినిమా రైటర్ కూడా మొక్కుబడిగా ఈ సినిమా చేసినట్టు ఉంది కానీ ఏ ఒక్క విభాగంలో కూడా అలరించలేకపోయాడు.మ్యూజిక్ డైరెక్టర్ కాస్త ఎఫర్ట్ పెట్టినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.నిర్మాణ విలువలు,సినిమాటోగ్రఫీ ఓకే.

ఫైనల్ గా: ఏదేదో ఊహించుకుని ఈ సినిమాకి వెళ్లిన వాళ్ళకి కాసేపటికే ఎగ్జిట్ డోర్ వెదుక్కోవాలి అనిపిస్తుంది.మరీ సి సెంటర్ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చెయ్యని నాలుగు కామెడీ సీన్స్ రాసుకుని,హీరోయిన్స్ అందాల విందునే నమ్ముకుని చేసిన వేర్ ఈజ్ వెంకటలక్ష్మి పూర్తిగా అవాయిడబుల్ మూవీ గా నిలిచింది

పంచ్ లైన్: వెంకటలక్ష్మి …వేర్ ఈజ్ ది ఎగ్జిట్ డోర్