జ‌న‌సేన అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తారో తెలుసా..!

PAWANKALYAN, AP, JANASENA, KANAKADURGAMMA, VIJAYAWADA, ELECTION, ANDHARAPRADESH,
PAWANKALYAN, AP, JANASENA, KANAKADURGAMMA, VIJAYAWADA, ELECTION, ANDHARAPRADESH,

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ఒక‌రు జ‌న్మ‌భూమి అంటూ.. మ‌రొక‌రు పాద‌యాత్ర పేరిట జ‌నాన్ని చుట్టేస్తున్నారు. ఇక ప‌వ‌న్ పోరాట యాత్ర కూడా సాగుతూనే వుంది.

ఈ నేప‌ధ్యంలో ఆ యా పార్టీ ల అధినేత‌లు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు అప్పుడే అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌డు ఈ కోవ‌లోకి ప‌వ‌న్ కూడా చేరిపోయారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేసేది జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఏపీలో తాము అధికారంలోకి వస్తే మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కృషి చేస్తామన్నారు.

వారికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్టు ప్ర‌క‌టించారు. మహిళల వంటింటి కష్టాలు తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు . వారి కోసం ప్రత్యేక ఆర్థిక వ్యవస్థను, మహిళా బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్టు అభ‌యం ఇచ్చారు. మహిళల రక్షణ – జనసేన బాధ్యతగా స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్‌.