మళ్ళీ అదే దారిలో ఘాజి డైరెక్టర్

Sankalp Reddy
Sankalp Reddy

లిమిటెడ్ బడ్జెట్ లో ఘాజి ని మూడు భాషల్లో తీసి అందరిచేత శభాష్ అనిపించుకున్న సంకల్ప్ రెడ్డి ఆ తరువాత స్పేస్ బ్యాక్ డ్రాప్ లో అంతరిక్షం తీసాడు.వరుణ్ తేజ్ లాంటి హీరో,క్రిష్ లాంటి ప్రొడ్యూసర్ ఉన్నా కూడా సినిమాటిక్ లిబరిటీ హద్దులు దాటడంతో ఆ సినిమా అనుకున్నంతగా అందరికి కనెక్ట్ కాలేదు.టాక్ మరీ నెగెటివ్ గా రావడంతో అంతరిక్షం బిగ్గెస్ట్ కమర్షియల్ డిజాస్టర్ గా మిగిలింది.

అయితే తెలుగులో అసలు అలాంటి ప్రయత్నం చెయ్యడమే గొప్ప అనే పొగడ్తలు మాత్రం దక్కాయి.ఇలా వరుసగా రెండు టెక్నీకల్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేసిన సంకల్ప్ నెక్స్ట్ ఎలాంటి సినిమా తీస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పడు సంకల్ప్ తన మూడో సినిమా బ్యాక్ డ్రాప్ రెడీ చేసుకుని స్క్రిప్ట్ వర్క్ కి సిద్దమవుతున్నాడు అని తెలుస్తుంది.

అంటార్కిటికాలో జరిగే పరిశోధనల నేపథ్యంలో స్టన్నింగ్ విజువల్స్,సుపీరియర్ టెక్నికల్ కాంబో డా దీన్ని మలచాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన రీసెర్చ్ వర్క్ పూర్తయిందని,దాన్ని సినిమాటిక్ గా మలిచిన తరువాత ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు.అయితే ఈ సినిమాని బాలీవుడ్ లో తెరకెక్కించాలనేది సంకల్ప్ రెడ్డి గోల్.

ఎందుకంటే అక్కడ అల్రెడీటీ రెండు,మూడు కమిట్మెంట్ లు ఉన్నాయి.పైగా అంతరిక్షం కేవలం తెలుగుకే పరిమితమైన సినిమాగా మలచడం వల్ల ఫైనాన్షియల్ గా కూడా నష్టాలు వచ్చాయి.అందుకే ఈ సినిమాని మాత్రం సేఫ్ కమర్షియల్ ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దడం కోసం బాలీవుడ్ లో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడు.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో రివీల్ చెయ్యనున్నారు.ఫెయిల్యూర్ వచ్చినా కూడా సంకల్ప్ మళ్ళీ టెక్నికల్ జోనర్ లోనే సినిమా తియ్యాలనుకోవడం మాత్రం డేరింగ్ అత్తెంప్త్ అని ఒప్పుకోవాలి.