ఎన్డీయేతర పక్షాలను ఏకం చేస్తోన్న చంద్ర‌బాబు

Election, Political, Ap, Andhara Pradesh, Agriculture , Tdp, Congress, Bjp,
Chandra babu naidu

ఎన్నికల సంఘం రోజురోజుకు విశ్వసనీయత కోల్పోతోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అధికారంలో ఉన్న వారికి క్లీన్‌చిట్‌ ఇవ్వటం.. ప్రతిపక్షంపై పగబట్టడం ప్రజాస్వామ్యంలో క్షేమం కాదని హితవు పలికారు. హ‌స్తిన ప‌ర్య‌ల‌న‌లో భాగంగా ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బిజీ బిజీ గ‌డుపుతున్నారు. కాంగ్రెస్ అధ్య‌క్షులు రాహుల్ తో స‌మావేశ‌మైన ఆయ‌న బిజేపియేత‌ర ప‌క్షాలను ఏకం చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. ప్రసుత్త రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ .. ఎన్నికల విధానం పారదర్శకతంగా ఉండాలని పోరాడుతున్నట్లు స్పష్టంచేశారు. ఈసీ తన ప్రతిష్టను దిగజార్చుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.