ఏపిలో సామూహిక గృహ ప్రవేశాలు

Gruha-Pravesham
Gruha-Pravesham

విభజన గాయంపై కారం చల్లేందుకే నరేంద్ర మోడీ ఏపికి వస్తున్నారన్నారు సిఎం చంద్రబాబు . నెల్లూరులో ఎన్టీఆర్ ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో 17 వ‌లే 117 ఇళ్లను లబ్ధిదారులకు సిఎం అందించారు. గ్రామీణ ప్రాంతంలో 14,116, పట్టణ ప్రాంతంలో 3,001 ఇళ్లను అందజేశారు. మోడీ ఏపీ ప్రజలకు నమ్మక ద్రోహం చేశారన్నారు సిఎం చంద్ర‌బాబు.

కాంగ్రెస్ హయాంలో ఇళ్లు కట్టకుండా రూ.4 వేల కోట్లు మాయం చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టినవి నివాసయోగ్యంగా లేవన్నారు ఆయ‌న‌. పట్టుకుంటే పడిపోయే పరిస్థితిలో కట్టారన్నారు. తిరుపతిలో రూ.19కోట్లు అదనంగా ఇచ్చి కాంగ్రెస్ కట్టిన ఇళ్లను బాగు చేయించామన్నారు. గతంతో పోలిస్తే ఇళ్ల నిర్మాణానికి ఏడు రెట్లు ఎక్కువ నిధులు ఇస్తున్నామన్నారు. గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లకు ధీటుగా ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు సిఎం చంద్రబాబు .