ఆయన కోసం ఎదురుచూస్తున్నా!

Pawankalyan, JanasenaParty, PentapatiPullarao, Twitter,

ప్రముఖ ఆర్థికవేత్త, పర్యావరణ ఉద్యమకారుడు పెంటపాటి పుల్లరావుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంశలు  కురిపించినారు . పెంటపాటిని జనసేన పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు కూడా తెలిపారు. దేశంలో నెల కొన్న ప్రస్తుత రాజకీయలాపై ఆయన రాస్తున్న కథనాలు విషయాపూరితంగా ఆలోచించేవిదంగా ఉన్నాయని తెలిపారు.

వొక సందర్భంలో పవన్ ,తాను పుల్లారావుని కలుసుకున్నాననీ, ఇద్దరం కొంత సమయం పాటు వొకరి ఆలోచనలను మరొకరం పంచుకున్నామని తెలియచేసారు. అనుభవం కలిగిన పుల్లారావు లాంటి వ్యక్తుల మార్గదర్శకత్వం జనసేన లాంటి కొత్త పార్టీకి ఎంతైనా అవసరం అన్నారు . జనసేన పార్టీలో చేరాల్సిందిగా , ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు.

twitter,pawanhttps://twitter.com/PawanKalyan jan 27 image

ఈ విధంగా ట్విట్టర్ లో స్పందించిన పవన్ కల్యాణ్.. జనసేన విధానాలపై పుల్లారావు రాసిన ఓ వార్తా కథనం క్లిప్ ను ట్వీట్ కు జత చేశారు.