సాధారణ భక్తులతో కలిసి భోజనం చేసిన వెంకయ్యనాయుడు

Vice President Venkaiah Naidu
Vice President Venkaiah Naidu

తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబసభ్యులు తో కలిసి దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయానికి వచ్చిన ఆయనకు మహాద్వారం వద్ద అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.అనంతరం తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంలో మధ్యాహ్నం సాధారణ భక్తులతో కలిసి సామూహిక భోజనం చేశారు. శ్రీవారి భక్తులకు తితిదే అందిస్తున్న భోజనం మంచి రుచి, నాణ్యతతో ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్కడి అధికారులను ప్రశంసించారు. అంతకుముందు వెంకయ్య కుటుంబసభ్యులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.