మాస్ అభిమానులకు ఫీస్ట్ గా అజిత్ విశ్వాసం ట్రైలర్…!

Ajith Viswasam

తమిళనాడు లో హ్యుజ్ ఫ్యాన్ బేస్ ఉన్న అజిత్ హీరోగా తెరకెక్కిన సినిమా విశ్వాసం.ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటివరకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వేదాళం,వీరమ్ బ్లాక్ బస్టర్స్ గా నిలవగా,గత సినిమా వివేగం కూడా పెద్ద కమర్షియల్ హిట్ అనిపించుకుంది.దాంతో మళ్ళీ శివ డైరెక్షన్ లో సినిమా చేసాడు అజిత్.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే దుమ్మురేపే రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ అయితే మాస్ ఫీస్ట్ అంతే.ఈ ట్రైలర్ చూస్తుంటే అజిత్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని శివ నిలబెట్టుకున్నట్టే కనిపిస్తున్నాడు.విశ్వాసంలో అజిత్ లుక్ అల్టిమేట్ అని చెప్పుకోవాలి.

ఒక పక్క కాస్త అల్లరి చేస్తూ సందడిగా కనిపిస్తున్న పాత్ర మరోపక్క మాత్రం ఫుల్ వైట్ బియర్డ్ తో పవర్ ఫుల్ హీరోయిజం చూపించే పాత్ర చేస్తున్నాడు.ట్రైలర్ ప్రకారం చూసుకునే అజిత్ ది డబుల్ రోల్ అనిపిస్తుంది.ఇక నయనతార ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్.పైగా ఈ సినిమాలో మరింత చార్మింగ్ గా కనిపిస్తుంది.సినిమా లైన్ ఒక ఏరియా ని కాపాడుకోవడానికి మాస్ లీడర్ చేసే పోరాటం అని తెలుస్తుంది.కానీ ఎగ్జిక్యూషన్ లో మాస్ మసాలా ని ఒక రేంజ్ లో దట్టించాడు శివ.జగపతిబాబు స్టైలిష్ విలన్ గా ప్రాధాన్యం ఉన్న పాత్రని చేసాడు.వెట్రి సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచేస్తే, ఇమ్మాన్ మ్యూజిక్ మాస్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

వివేగం సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించిన సత్యజ్యోతి ఫిలిమ్స్ ఈ సినిమాని కూడా ఎక్కడా కాంప్రమైస్ కాకుండా రూపొందించారు.ట్రైలర్ వరకు చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా షేర్ హిట్ అనిపిస్తుంది.ట్రైలర్ చివరిలో అజిత్ తన పేరు అడ్రెస్ చెప్పి విలన్స్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ అయితే అరుపులే.సినిమాకి అదే హైలైట్ సీన్ అయ్యేలా ఉంది.పొంగల్ రిలీజ్ అని కన్ఫర్మ్ చేసిన టీమ్ ఇంకా డేట్ మాత్రం ఇవ్వలేదు.