విశ్వామిత్ర ట్రైలర్ రివ్యూ : పక్కా హారర్ ఫార్ములా

Viswamitra Theatrical Trailer Review in Telugu
Viswamitra Theatrical Trailer Review in Telugu

గీతాంజలి సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ రాజకిరణ్ ఆ తరువాత మాత్రం త్రిపుర సినిమాతో అనుకున్న హిట్ కొట్టలేకపోయాడు.మళ్ళీ ఇన్నాళ్లకు తనకు అచొచ్చిన,బాగా నచ్చిన హారర్ జోనర్ లోనే విశ్వామిత్ర అనే ఒక సినిమా చేసాడు.ప్రేమకథాచిత్రం ఫేమ్ నందిత నటించిన ఈ సినిమా టీజర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చెయ్యగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

నిజమయిన సంఘటనల ఆధారంగా రాజకిరణ్ అల్లుకున్న ఈ కథలో ట్విస్టులు ఎక్కువగా ఉన్నట్టున్నాయి.హారర్ ఎలిమెంట్ కూడా బాగానే వర్క్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది.తమిళ్ హీరో,స్నేహ హస్బెండ్ అయిన ప్రసన్న పోలీస్ గా ప్రామినెంట్ రోల్ లో కనిపిస్తున్నాడు.ఇలాంటి సినిమాలకు చాలా అవసరమయిన కామెడీ కూడా కొంతవరకు పండినట్టు కనిపిస్తుంది.థ్రిల్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ ఎలివేషన్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్,అనిల్ భండారి సినిమాటోగ్రఫీ సినిమా థీమ్ ని బాగా ఎలివేట్ చేస్తున్నాయి.ఈ సినిమా కథ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా నిర్మాణంలో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు రాజకిరణ్.ట్రైలర్ వరకు అయితే అతని నమ్మకం నిలిబడినట్టే కనిస్తుంది.సినిమా ఎలాంటి రిజల్ట్ అందిస్తుంది అనేది సినిమా రిలీజ్ డేట్ అయిన మార్చ్ 21 న తెలుస్తుంది.

 

విశ్వామిత్ర ట్రైలర్ రివ్యూ