విశాల్ ‘అయోగ్య‘ రిలీజ్ డేట్…!

Ayogya Movie
Ayogya Movie

తెలుగులో ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చి సూపర్ హిట్ అయినా చిత్రం ‘టెంపర్’.ఈ సినిమా తమిళం లో విశాల హీరోగా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాశిఖన్నా హీరోయిన్. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ విడుదలై సినిమా ఫై అంచనాలు పెంచగా,తాజాగా చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

ఈ సినిమాను ఏప్రిల్‌ 19న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులను స్క్రీన్‌ సీన్‌ సంస్థ కొనుగోలు చేయగా , సామ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ‘ఠాగూర్‌’ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.