ప‌శ్చిమ బెంగాల్ లో అక్క‌డ‌క్క‌డా పోలింగ్ ఉద్రిక్తం

West Bengal
West Bengal

లోక్‌సభ రెండో విడ‌త పోలింగ్ పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త‌త‌కు దారితీసింది. రాయ్‌గంజ్, చోప్రా ప్రాంతాల్లో ప‌లు ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి.. రాయ్‌గంజ్ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్‌ను టీఎంసీ కార్యకర్తలు తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ అభ్యర్థి దేబశ్రీ చౌధురి ఆరోపించారు. అక్కడున్న ముస్లింల వద్ద ప్రచారం చేస్తున్నారనీ… పోలింగ్ జరుగుతున్న నేప‌ధ్యంలో ఇలాంటివి త‌గ‌వ‌ని ఆమె ప్రశ్నించారు. మరోవైపు అల్లరిమూకలు రాళ్లు రువ్వుతూ ఘర్షణకు దిగడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు. మ‌రోవైపు చోప్రాలోని ఒక పోలింగ్ బూత్‌లో ఓట్లు వేసేందుకు తమను అనుమతించడం లేదంటూ 34వ నంబర్ జాతీయ రహదారిని స్థానిక ఓట‌ర‌ల్ఉ దిగ్బంధించారు. పోలీసులు లాఠీ చార్జి చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించారు.