వినయ విధేయ రామ రికార్డ్

vinaya vidheya rama

వినయ విధేయ రామ…సంక్రాంతి సినిమాల్లో మాస్ లో బలమయిన టాక్ ఉన్న సినిమా ఇది.రామ్ చరణ్ అండ్ బోయపాటి మార్క్ ల వల్ల ఈ సినిమాకి ఆ మాత్రం టాక్ ఉండడం కామన్.కానీ పాటలు విన్నాక,ట్రైలర్ చూసాక మాత్రం మరింత పెరగాల్సిన అంచనాలు తగ్గాయి.ఎవ్వరు ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా కూడా ఇది నిజం.కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంది.వినయ విధేయ రామ థియేట్రికల్ బిజినెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది.వరల్డ్ వైడ్ గా 94 కోట్ల 10 లక్షలకు సినిమా అమ్మారు అని టాక్ వినిపిస్తుంది.

రంగస్థలం తో రామ్ చరణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.అందుకే ఈ రేంజ్ లో అమ్మకాలు జరిగాయి.ఓవర్సీస్ లో సైతం 9 కోట్లకు ఈ రైట్స్ అమ్మారు.అక్కడ మాత్రం బోయపాటి ఫ్యాక్టర్ వల్ల ప్రైస్ డ్రాప్ అయ్యింది.ఈ మొత్తం రికవర్ చెయ్యాలంటే కచ్చితంగా భారీ హిట్ కొట్టాలి.ఎందుకంటే బరిలో మూడు బలయిన సినిమాలు ఉన్నాయి.మిగతా సినిమాలు అమ్మిన రేట్స్ ని బట్టి చూస్తే వాటికి రిస్క్ తక్కువ.దాంతో ఇప్పడు భారం అంతా రామ్ చరణ్ పైనే ఉంది.తెలుగులో బాహుబలి,అజ్ఞాతవాసి,భరత్ అనే నేను సినిమాల తరువాత ఇంత పెద్ద బిజినెస్ చేసిన సినిమా ఇదే.

నిజానికి ఈ సినిమాని కూడా 75 కోట్ల రేంజ్ లో అమ్మమని చెర్రీ ఆర్డర్.కానీ బోయపాటి ప్లానింగ్ వల్ల సినిమా కాస్ట్ చాలా పెరిగిపోయింది.బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే భారీ రేట్లకు అమ్మడం తప్ప వేరే దారిలేదు.అందుకే ఇంత ఎక్కువకి అమ్మారు.రంగస్థలం తో అనూహ్య విజయం అందుకున్న రామ్ చరణ్ ఈసారి ఎన్ని రికార్డ్స్ తిరగ రాస్తాడో చూడాలి.