‘వినయ విధేయ రామ’ సినిమాకు సెన్సార్ ‘యు/ఏ’ సర్టిఫికేట్…!

vinaya vidheya rama

మాస్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘వినయ విధేయ రామ’.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోయడానికి సంక్రాంతి కి సిద్ధం అవుతుంది. ఇక సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని ‘యు/ఏ’ సర్టిఫికెట్ ని సొంతం చేచేసుకుంది. ఈ సినిమా ఓవరాల్ గా రన్ టైం సుమారు 2 గంటల 30 నిమిషాలకు అటూ ఇటూ గా ఉండబోతుందని సమాచారం.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కయార అద్వానీ నటిస్తుంది.హీరో ప్రశాంత్,ఆర్యన్ రాజేష్,నటి స్నేహ కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11 న విడుదల కానుంది.