సైరా కి ఆ లుక్స్ ప్లస్సా?…మైనస్సా?

VijaySethupathi in SyeRaa NarasimhaReddy as Raaja Paandi
VijaySethupathi in SyeRaa NarasimhaReddy as Raaja Paandi

సైరా సినిమా అనౌన్స్ చేసినప్పుడు,సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ సినిమాపై ఫుల్ హైప్ ఉంది.కానీ రాను రాను ఈ సినిమా టీమ్ ఫాలో అవుతున్న ప్రమోషన్ స్ట్రాటజీస్ సినిమాపై ఆసక్తి సన్నగిల్లేలా చేస్తున్నాయి.ఈ సినిమాలో అనేకమంది నటీనటులు ఉన్నారు.దాంతో ఈ సినిమాకి ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది.

కానీ వాళ్ళకి సంబందించిన బర్త్ డేస్ సందర్భంగా వాళ్ళ లుక్ కి సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు.అలా చేస్తూ చేస్తూ ఇప్పుడు విజయ్ సేతుపతి బర్త్ డే పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.ఈ ప్రమోషన్ స్ట్రాటజీ మాత్రం సైరా కి ఎలాంటి హెల్ప్ అవ్వట్లేదు.ఎందుకంటే ఆ లుక్స్ అన్నీ ఇంచుమించు ఒకేలా ఉంటున్నాయి.పైగా వాళ్లంతా నర్సింహారెడ్డి ఫాలోవర్స్ అనే కీలకమయిన విషయం కూడా రివీల్ అయిపోతుండడంతో సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది.ఇప్పటికే అమితాబ్,నయనతార,సుదీప్ ఇలా కీ కాస్ట్ లుక్స్ కూడా రివీల్ అయిపోయాయి.

అవన్నీ కూడా ఒక మామూలు సినిమాకి సంబందించిన రెగ్యులర్ మోషన్ పోస్టర్స్ లా కనిపిస్తున్నాయి.దీంతో సైరా నుండి ఒక ప్రమోషనల్ మెటీరియల్ బయటకి వస్తే ఉండాల్సిన హడావిడి ఏమీ కనిపించడంలేదు.బాహుబలికి వర్క్ అవుట్ అయిన స్ట్రాటజీ వాడితే సైరా కి మేలు జరుగుతుంది.సినిమా రిలీజ్ డేట్ కి నెల రోజులముందు నుండి ఈ ప్రమోషనల్ మెటీరియల్ వదులుతూ నిత్యం వార్తల్లో ఉంటే వచ్చే హైప్ వేరు.సైరా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అంతా అలెర్ట్ అవుతారు.ఆ హైప్ సినిమా కలెక్షన్స్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది.కానీ ఇలా ఎప్పటికప్పుడు ఎదో ఒక లుక్ అలా రిలీజ్ చేసుకుంటూ పోవడం వల్ల ఏ ఒక్క రకంగాను సినిమాకి ఉపయోగం లేదు.

పైగా నష్టం కూడా కలిగేలా ఉంది.ఇప్పటికయినా సైరా టీమ్ మేల్కుని షూటింగ్ పై ఫోకస్ చేసి,250 కోట్ల భారీ బడ్జెట్ సినిమా రేంజ్ లో పబ్లిసిటీ ప్లాన్ చేసుకుంటే మంచింది అనేది ఫాన్స్ ఫీలింగ్.